హుజురాబాద్ కాంగ్రెస్స్ ఇంచార్జి ప్రణవ్.
నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)కమలాపూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంను బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్స్ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ సందర్శించారు.ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యను సభ్యులు ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లారు. గత మూడు నెలల నుండి టెస్కో సంస్థ తయారైన వస్త్రాలను కొనుగోలు చేయక పోవడంతో కోటి రూపాయల విలువ గల చేనేత వస్త్రాలు చేనేత
సంఘం గోడౌన్ లోనే నిలువ వున్నాయని,దానితో
కార్మికులకు రోజు వారి కూలి డబ్బులు ఇవ్వలేకపోతున్నామని,
కార్మికులు ఆందోళన చెందుతున్నారని, కార్మికులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ లో పేరుకుపోయిన వస్త్రాలను పరిశీలించారు.
కార్మికుల సమస్యలకు స్పందించిన
ప్రణవ్ కార్మికుల సమస్యను,నిలువ ఉన్న వస్త్రాల కొనుగోలు పై మంత్రి కి వివరిస్తానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో
చేనేత సహకార సంఘ నాయకులు తవుటo రవీందర్ సామాల దామోదర్, తాటిపాములు రాము తో పాటు చేనేత కార్మికలు పాల్గొన్నారు.