
handloom day
ఆర్కేపీలో ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలో చేనేత దినోత్సవ వేడుకలను అధ్యక్షులు వనం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి కుల సంఘం సభ్యులు చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని పురవీధులల్లో తిరుగుతూ నిర్వహించారు. నేత కార్మిక సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ మనోధైర్యాన్ని అందిస్తూ పట్టణంలోని అన్ని వీధులలో పర్యటించారు. ఈ సందర్భంగా వనం సత్యనారాయణ మాట్లాడారు. నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండాలని కోరారు. నేత కార్మికులకు ఉచిత కరెంటు, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఎత్తివేయాలని, నేత అన్నలకు కనీస వేతనం అందే విధంగా చూడాలని, వస్త్రాలను అన్ని రంగాల్లో సోదరులకు అందించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఆడేపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, ఉపాధ్యక్షులు ఆడేపు కృష్ణ, సమ్మయ్య, సహాయ కార్యదర్శి వేముల అశోక్, ఆర్గనైజర్ సెక్రటరీ కొండ కుమార్ ,బొద్దుల ప్రేమ్ సాగర్, యాదగిరి, తిరుపతి, వెంకట స్వామి, సంతోష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.