నెక్కొండ, నేటి ధాత్రి:వరంగల్ జిల్లా నెక్కొండ మండల తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హంస నరేందర్ కు గణతంత్ర దినోత్సవం అని పురస్కరించుకొని ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ అధికారిగా అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హంస నరేందర్ అందుకున్నారు .ఈ సందర్భంగా తాసిల్దార్ వేముల రాజకుమార్, డిప్యూటీ తహసిల్దార్ పాలకొండ రవి, పలు ఊరు ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని వర్గాల ప్రజలు హంస నరేందర్ కు అభినందన తెలిపారు. అవార్డుతో నాకు మరింత బాధ్యత పెరిగిందని ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను ఇక ముందు గతంలో కన్నా ఇంకా మరింత నిబద్దతతో పనిచేస్తానని హంస నరేందర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రఘు, టైపిస్ట్ సుధాకర్ ధరణి ఆపరేటర్ మనీ రికార్డ్ అసిస్టెంట్లు సుధాకర్ రాకేష్ రమేష్ నవీన తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ అవార్డుకు ఎంపికైన హంస నరేందర్
