Gusto 2025 Concludes Grandly at GITAM
గీతంలో విజయవంతంగా ముగిసిన ‘గస్టో’
విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాల ప్రదానం
నేటి ధాత్రి, పఠాన్ చేరు :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన అంతర్-విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా ఉత్సవం, 2025-26, క్రీడాతత్వం, సమష్టికృషి, అజేయమైన క్రీడా స్ఫూర్తితో విజయవంతంగా ముగిసింది. ఇది కేవలం ఒక ఆటల పోటీలుగానే కాక, ఓర్పు, ఐక్యత, అవిశ్రాంతంగా రాణించాలనే తపనల పండుగగా సాగింది. ఉత్కంఠభరితమైన ప్రారంభ మ్యాచ్ నుంచి ఉత్సాహభరితమైన చివరి క్షణాల వరకు, టోర్నమెంట్ అద్భుతమైన విన్యాసాలు, ఉత్కంఠభరితంగా ఆయా క్రీడలను ప్రదర్శించడమే గాక, ఇందులో పాల్గొన్న వారందరిపై చెరగని ముద్ర వేసింది. ఈ టోర్నమెంటులో దాదాపు 60 విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన 120కి పైగా క్రీడా జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.గస్రో అంటే కేవలం గెలవడం, లేదా ఓడిపోవడం కాదని, ఇది పట్టుదల, స్నేహం, క్రీడల ద్వారా జీవితంలోని గొప్ప పాఠాలను నేర్చుకోవడంగా నిర్వాహకులు అభివర్ణించారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ బృంద కృషి, అంకితభావం, క్రీడా. స్పూర్తి యొక్క విలువలను ముందుకు తీసుకెళ్లాలని వారు అభిలషించారు. ఇది విజయవంతం కావదానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ. ఆతిథ్య- క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, క్రీడల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.నారాయణరావు చౌదరి విజేతలకు క్రీడా ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
కబడ్డీ: విజేత సీఎంఆర్-జెక్. రెండో స్థానం గీతం త్రోబాల్: విజేత జీఎన్ఐటీఎస్, రెండో స్థానం గీతంబ్యాడ్మింటన్:
పురుషులు-సింగిల్స్ విజేత గీతం, రెండో స్థానం కేఎల్ యూ- హైదరాబాదు
పురుషులు-డబుల్స్: విజేత కేఎల్ యూ- హైదరాబాదు. రెండో స్థానం గీతం
మహిళలు-సింగిల్స్: విజేత సీబీఐటీ, రెండో స్థానం ఐపీఈ
మహిళలు-డబుల్స్: విజేత గీతం, రెండో స్థానం సీబీఐటీ
మిక్స్ డ్ డబుల్స్ విజేత ఐపీఈ, రెండో స్థానం వోక్సన్
టేబుల్ టెన్నిస్:
పురుషులు-సింగిల్స్ విజేత వీఎస్ఆర్ వీజేఐటీ, రెండో స్థానం బిట్స్ – హైదరాబాదు
పురుషులు-డబుల్స్ విజేత బిట్స్- హైదరాబాదు, రెండో స్థానం ట్రిబుల్ ఐటీ-హైదరాబాదు
మహిళలు-సింగిల్స్: విజేత జీఎన్ఐటీఎస్, రెండో స్థానం కేఎంసీఈ మహిళలు-డబుల్స్: విజేత కేఎంసీఈ, రెండో స్థానం జీఎన్ఐటీఎస్
మిక్స్ డ్ డబుల్స్ విజేత వీఎన్ఆర్ వీజేఐటీ, రెండో స్థానం గీతం.గస్టో – 2025-26ని మరపురాని అనుభవంగా మార్చడంలో సహకరించిన ప్రతి ఒక్కడికీ నిర్వాహకులు కృతఙ్ఞతలు తెలియజేశారు. గస్రో-2027ను మరింత ఉన్నతంగా, సాటిలేని ఉత్సవంగా, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించే సిసలైన వేదికగా నిలపాలని అభిలషిస్తూ, ఈ వేడుకలను ముగించయని తెలిపారు
