ఐటీసీ బి.ఎం.ఎస్ ఆధ్వర్యంలో
భద్రాచలం నేటి ధాత్రి
ఐటీసీ భద్రాచలం మహిళా సమితి (బి.ఎం.ఎస్ ) ఆధ్వర్యంలో స్థానిక గిరిజన గురుకులంలో ఇంటర్, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 725 మంది బాలికలకు ఎగ్జామ్ కిట్ ( ఫ్యాడ్, పెన్స్, స్కెచ్ పెన్స్, రబ్బర్, స్కేల్, పౌచ్ ) అందజేశారు
ఈ సందర్బంగా బిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ టి.సునీత మెహంతి, రేష్మ శర్మ, ప్రతిభ మనోజ్ లు మాట్లాడుతూ…భద్రాచలం గిరిజన గురుకులం బాలికలు అన్నీ రంగాలలో రానించటం తమను ఎంతగానో ఆకట్టుకుందని అందుకే గిరిజన పిల్లలను ప్రోత్సహించేందుకు ఎగ్జామ్ కిట్స్ అదిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం పిల్లలు సద్వినియోగం చేసుకొని ఇంటర్, టెన్త్ పరిక్షలలో చక్కని మార్కు లు సాదించాలని తెలిపారు.
భద్రాచలం గిరిజన గురుకులం ప్రిన్సిపాల్ ఎం. దేవదాస్ మాట్లాడుతూ…తమ పిల్లలను ప్రోత్సహిస్తూ ఎంతగానో ఉపయోగపడే పరీక్షలకు సంబంధించిన కిట్లను ఐటిసి బిఎంఎస్ నిర్వాహకులు అందజేయటం అభినందనీయమని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల అధ్యాపకులు, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాప్, బిఎంఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు