కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకుల విద్యార్థుల రాష్ట్ర స్థాయి ర్యాంకులు
జూనియర్ ఇంటర్ ఎంపీసీ లో 468 మార్కులతో రాష్ట్రంలో మొదటి ర్యాంకు
జహీరాబాద్. నేటి ధాత్రి:
వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో సత్తా చాటారని హోతి -కె ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు.
జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను ఎ.గాయత్రి, ఐశ్వర్య అనే విద్యార్థులు 468 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి స్థాయి ర్యాంకులు సాధించినట్లు ఆమె తెలిపారు.
బి. నికిత 470 మార్కులకు గాను 468, కె. స్నేహ 467, ఎం. అరవింద 467, ఎం. పూజ 466, టీ స్పందన 465, ఆఫియా తాసుమ్ 465, ఏ. ప్రవళిక 465, జి మేఘన 464, జాదవ్ లతా బాయ్ 464 మార్కులు సాధించారు. బైపిసి మొదటి సంవత్సరంలో 440 మార్కులకు సిహెచ్ భవాని 436, జాయ్స్ మేరీ 435, ఎం. హరిణి 433, కే వైశాలి 432, వర్షిక 432, కీర్తి 432, మహేశ్వరి 430 సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 1000 మార్కులకు గాను ఎం. అర్చన 986, హరిప్రియ 986, దేవి శ్రీ 986, జి.లయ 981, బైపీసీ రెండో సంవత్సరంలో 1000 మార్కులకు గాను నిత్య స్వరూపిణి 991, ఎస్. శివాని 991, పి వైశాలి 982, సాయి భవాని 980 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేఖ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాల అయినప్పటికిని కార్పొరేట్ కళాశాల కు దీటుగా తమ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థులు శ్రద్ధ వహించి ఏకాగ్రతతో చదవడం మూలంగా ఈ ర్యాంకులు సాధించినట్లు, ఈ ఉత్తమ ర్యాంకులు సాధించడానికి ఎంతో క్రమశిక్షణతో పాఠాలు బోధించిన ఉపాధ్యాయ బృందానికి ఎంతో సాయ సహకారాలు అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.