
Kaveri Parthu Selected for National Mini Handball
రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బాలబాలికల 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు కావేరి పార్ధు జాతీయస్థాయికి అర్హత సాధించినట్లు,వ్యాయామ ఉపాధ్యాయులు గాంధార్ల సంతోష్,పిడి.రత్నం శ్రీనివాస్,పి.ఇ.టి,తెలిపారు.సెప్టెంబర్ 26 నుండి 29 వరకు హైదరాబాదులోని నిజాం కాలేజీలో జరిగే,జాతీయ స్థాయి 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు,
ప్రిన్సిపల్ కోల నాగేశ్వరరావు తెలిపారు.వీరిని పాఠశాల సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్రవంతి,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ మహిపాల్, హౌస్ మాస్టర్ స్వర్ణలత,ఉపాధ్యాయ బృందం అభినందించారు.