TPCC Vice President Anumandla Jhansi Reddy
గుర్తూరు గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి
పాలకుర్తి ఇన్చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుక సోమవారం రోజు గుర్తూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు
గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కాసర్ల రంగయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మోత్కూరి రవీంద్ర చారి, వీసంపల్లి బాలకృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చాతకొండ శిరీష, తొర్రూర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాసర్ల రవికుమార్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు.
