Farmer Identification Registration Program at Gram Panchayat
రైతు గుర్తింపు నమోదు కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గుండంపల్లి సర్పంచ్
మల్లాపూర్ జనవరి 2 నేటి దాత్రి
గుండంపల్లి గ్రామపంచాయతీ వద్ద రైతు గుర్తింపు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ పద్మ నరసయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు గుర్తింపు నమోదు కొరకు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం గ్రామపంచాయతీ వద్ద చేసేలా ఏఈఓ గజానంద్ తో మాట్లాడి గ్రామపంచాయతీలోనే రైతు నమోదు జరిగేలా ఏర్పాటులు చేశామన్నారు. ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య ఏఈఓ గజానంద్ సమక్షంలో ఈ రైతు నమోదు కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, గంగారెడ్డి, నరసయ్య, శ్రీశైల మల్లేష్, సత్తయ్య, హనుమంతు, రాజారెడ్డి, నారాయణ, స్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
