ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి కృషి, గ్రామ ప్రజల ప్రోత్సాహం ఎంతో ఉంది,మండల విద్యాధికారి బత్తుల భూమయ్య!! .
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
క్రమశిక్షణ నాణ్యమైన విద్యా బోధన లో రాష్ట్రంలోనే ఉన్నత పాఠశాలగా ప్రాథమిక పాఠశాల గుల్లకోట నిలుస్తుందని ఈ పాఠశాలను ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయులు, చందూరి రాజిరెడ్డి, ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాధికారి బత్తుల భూమయ్య అభినందించారు, . ఇంతటి చక్కటి క్రమశిక్షణ, పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కడ చూడలేదని అన్ని విషయాల్లో పరిపూర్ణమైన విజ్ఞానం కలిగి ఉత్తమ పౌరులుగా ఎదిగే విధంగా కనిపిస్తున్నారని అన్నారు.రామ్ రాజ్ కాటన్ షోరూం చౌరస్తా కరీంనగర్ యజమాని తిరుపతి గారి సౌజన్యంతో ప్రాథమిక పాఠశాల గుల్లకోటలోని విద్యార్థులకు చేతి రుమాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, సంస్కారవంతమైన జీవన విధాన పద్ధతులు పెంపొందింప చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన రామ్ రాజ్ కాటన్ షోరూం కరీంనగర్ అధినేత తిరుపతి గారికి ,చేతి రుమాల్ల పంపిణీ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఎండపల్లి మండల విద్యాధికారి బత్తుల భూమయ్య కి ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చందూరి రాజిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ,ప్రధానోపాధ్యాయులు, చందూరి రాజిరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీమతి ఎస్ రమాదేవి ఎం శ్రీనివాస్ ఎన్ నరేష్ కుమార్ బి శ్రీలత కే కృష్ణారెడ్డి ఎస్ఎంసి చైర్మన్ గొల్లపల్లి శిరీష తదితరులు పాల్గొన్నారు