ఎండపల్లి జగిత్యాల నేటిదాత్రి
ధర్మపురి నియోజకవర్గ ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులు గ్రామ శాఖ అధ్యక్షులు బిసగోని సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అనంతరం నిండు నూరేళ్లు హాయిగా వర్ధిల్లాలని ఆ దేవుని వేడుకుంటూ పూజలు చేయడం జరిగింది, వీరి వెంట మండల ప్రధాన కార్యదర్శి భూసారపు భూమయ్య ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొల్లపెల్లి మల్లేశం గౌడ్ ,యూత్ అధ్యక్షులు గోనె సురేష్ మరియు కాంగ్రెస్ శ్రేణులు గోనె సంతోష్ తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గుల్లకోట కాంగ్రెస్ శ్రేణులు!!
