
ములుగు మదనపల్లి గ్రామానికి చెందిన గూగులోత్ రాజన్నకి డాక్టరేట్ పట్టా
ములుగు జిల్లా, నేటిధాత్రి :
ములుగు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ గుగులోత్. రాజన్న కి ఇటీవలే తెలంగాణ గవర్నర్ శ్రీ. జిష్ణుదేవ్ శర్మ గారి చేతుల మీదుగా కాకతీయ యూనివర్సిటీ నుండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగం లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన రాజన్న అనేక కష్టాలను ఎదుర్కొని ఇంతటి గౌరవాన్ని అందుకోవటం ప్రేరణ దాయకం. గిరిజనుల అభివృద్ధి కి ఆయన చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయం. ఈ సందర్బంగా డాక్టర్ గుగులోత్ రాజన్న కి ట్రైబల్ ఉపాధ్యాయలు సూర్యకిరణ్, ప్రతాప్ సింగ్, వేణునాయక్, దేవేందర్ అలాగే ట్రైబల్ అధ్యాపకులు రమేష్ నాయక్,వాసు నాయక్ తదితరులు అభినందనలు తెలిపారు. అలాగే మదనపల్లి గ్రామ ప్రజలు కూడా డాక్టర్ రాజన్న కు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామం గర్వ పడే స్థాయికి ఆయన ఎదుగుదల
కారణమని పేర్కొన్నారు.