హామీలు సరే…. వంతెన ఏదీ!
గ్రామం నుండి మండలానికి పోవడానికి తప్పని అవస్థ
శాయంపేట నేటిధాత్రి:
ప్రభుత్వాలు పాలకులు మారిన ప్రతిసారి సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీలు గుప్పిస్తు న్నారు చివరకు వాటిని అమ లు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. శాయంపేట మండలం నుండి నేరేడుపల్లి గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంలో ఇచ్చిన హామీలు నేటికీ నీటి మూట గానే మిగిలిపోయాయి.
ప్రజలకు తిప్పలు
నేరేడుపల్లి గ్రామం నుండి ప్రజలు మండల కేంద్రానికి రావడానికి ప్రజలకు తిప్పలు బ్రిడ్జి నిర్మాణం చేస్తే మండల కేంద్రానికి రావడానికి సమయం తక్కువగా ఉంటుంది బస్సు సౌకర్యం కూడా కలిగే ఆస్కారం ఉంటుందని ప్రజలు అంటున్నారు అప్పటి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రామారెడ్డి సైతం సమస్య పరిష్కరించకుండా వంతెన ఏర్పాటు చర్యలు తీసుకుం టామని మాట ఇచ్చిన నీటి మట్టలాగే మిగిలిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు శ్రీరామ రక్ష స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం

ఏదైనా పనిమీద మండల కేంద్రానికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. దీంతో అన్ని విధాల నష్టపోతున్నాం అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరువ తీసుకొని వంతెన త్వరిత గతిన నిర్మిస్తే ఇక్కట్లు తీరుతాయి.
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం
శాయంపేట మండలం నేరేడు పల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుంది. గ్రామం నుండి మండల కేంద్రానికి రావడానికి ప్రజల ఆర్థిక భారం పడాల్సి వస్తుంది. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ప్రజల కోరికను తీర్చాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాల పంచాయతీ ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ధ్యేయంగా ముందుకెళ్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అభివృద్ధి సంక్షే మాలు ప్రతి ఒక్క నిరుపేదకు అందించేలా చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరు తున్నారు.