కాకతీయ యూనివర్సిటీ మరియు ఎన్ సి టి ఈ నియమ నిబంధనలు పాటించి భద్రాచలం గిరిజన బిఈడి కళాశాలకి మహిళా ప్రిన్సిపాల్ ను నియమించాలి.GSP, డిమాండ్

భద్రాచలం. ది14/2/24.

భద్రాచలం నేటిదాత్రి

భద్రాచలం బుధవారం నాడు ఐటిడిఏప్రాంగణంలో విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ ఇర్ఫా ప్రకాష్ అధ్యక్ష తన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒకే ఒక్క భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాలగా భద్రాచలం ఏజెన్సీలో ఎంతో ప్రాచుర్యం పొందింది.కాకతీయ యూనివర్సిటీ, ఎన్ సి టి ఈ నియమ నిబంధనల ప్రకారం బీఈడీ, ఎంఈడి, పిహెచ్డి ఉండి 8 సంవత్సరాల భోధన అనుభవం ఉండాలని నిబంధనలు సూచిస్తుంటే దానికి విరుద్ధంగా కనీస అర్హతలు బీఈడీ, ఎమ్ఈడి లేని వారిని భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాలకి ప్రిన్సిపాల్ గా చేయడం ఐటిడిఏ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనీ ఆరోపించారు.కనీస అర్హతలను పరిశీలించకుండా గుడ్డిగా ప్రిన్సిపాల్ నియామకం ఐటిడిఏ అధికారులుచేపట్టారు. బీఈడీ కళాశాల కి,బీపెడ్ కళాశాలకి తేడా తెలియకుండా ఐటిడిఏ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు.
ఐటీడీఏ అధికారులు
గిరిజన బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నియామకం కోసం బహిరంగ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల యొక్క అర్హతలను బట్టి భర్తీ చేయాలని అన్నారు. లేనిపక్షంలో హైకోర్టు లో రిట్ పిటిషన్ వేస్తామని, రాస్తారోకో చేస్తామని అన్నారు
గిరిజన బిఈడి కళాశాలలో ఆశ్రమ పాఠశాలల నుండి డిప్యూటేషన్ పై వచ్చిన వారిని వారి సొంత పోస్టులకు పంపించాలని గతంలో ఎన్నోసార్లు ఐటిడిఏ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని వారి యొక్క డిప్యూటేషన్ను ఇప్పటివరకు రద్దు చేయకుండా వారిని అలాగనే కొనసాగిస్తున్నారని అన్నారు. ఏజెన్సీలో ఆదివాసి సామాజిక వర్గానికి చెందిన పిహెచ్డి చేసిన మహిళ అభ్యర్థులు ఉన్నారని, కళాశాలలో ఎక్కువమంది అమ్మాయిలు ఉన్నారని ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని ఆడపిల్లల శ్రేయస్సు నిమిత్తం అలాంటి వారిని గిరిజన బిఈడి కళాశాలకి ప్రిన్సిపాల్ గా మహిళని నియమించాలని గోడ్వానా సంక్షేమ పరిషత్తు గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో అఖిల భారత సంఘం జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్ చింత జనార్ధన్ మడకం చిట్టిబాబు రాజశేఖర్ ఈర్పా రాంబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!