పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూస్తాం.
స్టేషన్గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిరా.
రఘునాథపల్లి. (జనగామ) నేటి ధాత్రి :-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో గాను ఉపయోగపడుతున్నాయని. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందని అన్ని వర్గాల చూపు కాంగ్రెస్ వైపు ఉందని స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగపురం ఇందిరా, మాజీ జెడ్పిటిసి లింగాల జగదీష్ చంద్ర రెడ్డి అన్నారు. గురువారం రఘునాథ్ పల్లి మండలం కంచనపల్లి గ్రామంలో గ్రామ ఎంపీటీసీసభ్యురాలు బీఆర్ఎస్ నాయకురాలు కేమిడి రమ్య రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివిధ పార్టీల నాయకులు కుల సంఘాల నేతలు ఇందిర నాయకత్వంలో పార్టీలోకి వచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ సుస్థిరత పాలన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఇచ్చిన మాట నెరవేసే సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు ఆర్ గ్యారెంటీలో ఇప్పటికే ఐదు అమలు చేయడం జరిగిందని త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని ఆమె వివరించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు ఆమెను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్, సుభాష్ చంద్ర రెడ్డి,నీలం యువరాజు,విజయ్ మేరీ,వల్లాల పురుషోత్తం,సోమాజి,ఈశ్వరయ్య,పృథ్వ,రాజ్ కుమార్,కొమురవెల్లి,మండలంలోని వివిధ ఎంపీటీసీలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.