మమతా బెనర్జీలో పెరుగుతున్న అసహనం

వెంటాడుతున్న ఓటమి భయం

మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు మొదటికే మోసం తెస్తాయా?

ఆర్జీకర్‌ ఆస్పత్రి సంఘటన తర్వాత హిందూ ఓటర్లలో స్పష్టమైన మార్పు

తృణమూల్‌ వైఖరిపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం

వామపక్ష హిందూ ఓటర్ల ఆలోచనలో మార్పు

శ్రీరామనవమి ర్యాలీల ద్వారా హిందువుల ఐక్యతకోసం వ్యూహం

రాష్ట్రవ్యాప్తంగా 20వేల ర్యాలీల నిర్వహణకు నిర్ణయం

ఎప్పటిలాగే అనుమతివ్వని మమతా ప్రభుత్వం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలో ఇటీవల పెరిగిపోతున్న అసహన తీవ్రతను గమనించవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఆమె తీవ్ర ఒత్తిడిలో వున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జాగృతి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆమెలో ఒకవిధమైన ఆందోళన కనిపిస్తోంది. గత ఇరవయ్యేళ్ల పాలనలో ఆమె హిందువుల పండుగులకు ఏనాడు ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వలేదు. ఇందుకు కారణం ముస్లింల ఓట్లు. ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడతాయి కనుక ఆమె ఈ వర్గంవారిని సంతృప్తిపరచేందుకోసం వారికి అను కూల నిర్ణయాలు తీసుకుంటూ రావడం గమనార్హం. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో ముస్లింల శాతం 27శాతం కాగా ఇప్పుడు దాదాపు 40శాతం వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చీలిపోయే హిందువుల ఓట్లకంటే, ఏకమొత్తంగా పడే ముస్లింల ఓట్లు మమతా బెనర్జీని అధికారంలో నిలుపుతాయి. ఇదిలావుండగా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందు కెళుతున్న బీజేపీ హిందూ ఓట్లను సుసంఘటితం చేసే యత్నాలు గట్టిగా ప్రారంభించింది. గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని మరీ అడుగులు ముందుకేస్తోంది. గతంలో వచ్చిన 38.5శాతం ఓట్లశాతానికి మరో ఐదు లేదా ఏడుశాతం ఓట్లు అధికంగా సాధించగలిగితే అసెంబ్లీలో పాగా వేయవచ్చన్నది పార్టీ వ్యూహం. ఇదే సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో అవధులు లేని స్థాయికి చేరుకున్న అవినీతి, అత్యాచారాలు, హత్యలు, ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటన వంటివి హిందువుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచేశాయి. ఈ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాలు పన్నుతోంది.

ఈ వ్యూహంలో భాగంగా వచ్చే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కోటిమందితో రాష్ట్రంలో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళికను సిద్ధం చేసింది. గతంలో మాదిరిగానే పోలీసు లు శాంతిభద్రతల సమస్యను చూపుతూ ఇందుకు అనుమతినివ్వలేదు. ఉదాహరణకు శ్యాంపూర్‌లో రెండు`మూడు లక్షలమంది హిందూ జనాభా వుంటే, ఇక్కడ ర్యాలీలో కేవలం 2000` 2500 మంది మాత్రమే పాల్గనాలని పోలీసులు ఆంక్షలు విధించడం ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇటు వంటి మితిమీరిన ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా విధించడంతో విపక్షనేత సుబేందు అధికారిఇప్పుడు ప్రభుత్వంపై నేరుగా విమర్శల దాడిని పెంచారు. రాజ్యాంగంలోని 25`28 అధికరణ లు ప్రసాదిస్తున్న మతస్వేచ్ఛను మమత ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆయన ఎదురుదాడికి ది గారు. ‘సనాతని’లను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అణచివేయడం మమతా ప్రభుత్వానికే చెల్లిం దంటూ ఆ యన ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీరామనవమికి కోటి మందితో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓట్లకోసం ఆమె జిహాదీ మూకలకు మద్దతు పలుకుతూ హిందువులపై దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఆ యన విమర్శల మాట ఎట్లావున్నా, రాష్ట్రంలోని హిందువుల్లో గతంలో ఎన్నడూలేని విధంగా ఒకరమైన చైతన్యం వచ్చిందనే చెప్పాలి. హిందువుల ఓట్లు కాంగ్రెస్‌, వామపక్షాలు, బీజేపీల మధ్య చీలిపోయి వుండటం తృణమూల్‌ కాంగ్రెస్‌కు వరంగా మారింది. ఇదే సమయంలో ముస్లింల ఓట్లు గంపగుత్తగా సాధించడంతోపాటు, తనకు పడే హిందూఓట్లు ఆమె అధికారాన్ని చెక్కుచెదర కుండా కాపాడుతున్నాయి. కానీ ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల ఆలోచనా సరళిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వామపక్షాలు సోదిలోలేకుండా పోయినా, వారికున్న హిందూ ఓటర్లు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 తనను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ గత డిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇదే పంథా పశ్చిమ బెంగాల్‌లో కూడా అనుసరించాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వామపక్షాలతో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌కు స్నేహపూర్వక మద్దతు ఇచ్చినా, మమత తమను ఎంతమాత్రం ఖాతరు చేయకపోవడం కాంగ్రెస్‌ అధినాయకత్వానికి మింగుడుపడటంలేదు. ఈసారి కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు, తృణమూల్‌కు అనుకూలంగా ఓటు వే యనట్లయితే ఆమేరకు మమతా బెనర్జీకి నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ. ఎంత ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడినా, హిందూ ఓట్లు రాకపోతే మమతా బెనర్జీ అధికారంలోకి రావడం కష్టం. తాజా పరిణామాల నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తృణమూల్‌ పుట్టి మునగడం ఖాయం.

ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో వుంచుకొని బీజేపీ నాయకుడు సుబేందు అధికారి ఇప్పుడు నే రుగా సనాతని, హిందూత్వలకు అనుకూలంగా తన ప్రసంగాల వాడిని పెంచారు. ‘జో హమారే సాత్‌, హమ్‌ ఉన్‌కే సాత్‌’, ‘సబ్‌కా సాత్‌, సబ్‌గా వికాస్‌’ నినాదాలతో 2024 జులైనుంచి ఆయనతన ప్రసంగ ధోరణినే పూర్తిగా మార్చివేశారు. కొన్ని సందర్భాల్లో ‘కేవలం హిందువులు మాత్రమే హిందూస్తాన్‌ను పరిపాలిస్తారు’ అంటూ నినాదాలిస్తున్నారు. బహుశా ఈ దూకుడుకు ప్రధానకారణం వామపక్షాలు, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకులోని హిందూ ఓటర్లను ఆకర్షించడానికేనని చెప్పక తప్పదు. 

నిజం చెప్పాలంటే 2019 పార్లమెంట్‌ ఎన్నికలనుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ను సవాలు చేసే స్థా యికి బీజేపీ ఎదిగింది. నాటి ఎన్నికల్లో ఏకంగా 40.7% ఓట్లతో 18 లోక్‌సభ స్థానాల్లో (మొ త్తం 42సీట్లు) గెలుపు సాధించింది. 2014లో పార్టీకి రాష్ట్రంలో కేవలం 17శాతం ఓట్ల మద్దతు మాత్రమే వుండేది. కేవలం రెండు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చేంది. ఇక 2016లో అ సెంబ్లీలో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచు కొని తృణమూల్‌కు సవాల్‌ విసిరింది. అప్పుడు పార్టీకి లభించిన ఓట్లశాతం 38.14%. 

ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2021 ఎన్నికల్లో 48.02% ఓట్లతో 215 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 38.73 శాతానికి పడి పోవడంతో పదిలోక్‌సభ సీట్లను కోల్పోయి 12 సీట్లకు పరిమితం కాగా, టీఎంసీ 29 స్థానాల్లో (45.76% ఓట్లు) గెలిచింది. 

పై గణాంకాలను పరిశీలిస్తే మరో ఆరు లేక ఏడుశాతం ఓట్లు సంపాదిస్తే బీజేపీకి అధికారాన్ని చేజిక్కించకునే అవకాశాలు అధికం. ఈ నేపథ్యంలోనే ‘సనాతని’ వాదంతో అన్ని పార్టీలకు చెందిన హిందూ ఓటు బ్యాంకులపై బీజేపీ దృష్టిపెట్టింది. వచ్చే శ్రీరామనవమికి కోటిమందితో ర్యాలీ నిర్వహించాలని తలపెట్టడం ఈ వ్యూహంలో భాగమే. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి సంద ర్భంగా ఏప్రిల్‌ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది హిందువులతో 20వేల ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. గతంలో శ్రీరామనవమి ర్యాలీలపై పుబ్రా మిడ్నాపూర్‌ జిల్లాలోని ఈగ్రాలో మరియు ఇదే జిల్లాలోని శ్యాంపూర్‌లో దుర్గామాత విగ్రహాల విధ్వంసాలు జరిగిన అంశాలపై ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 8న ఈగ్రాలో, ఏప్రిల్‌ 7న శ్యాంపూర్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!