Youth Literature Fest Poster Launch
సమూహ యువ సాహితోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
వీణవంక ,నేటి ధాత్రి:
ఈనెల 22వ తేదీ శనివారం రోజున జరగబోయే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, కోటి, హైదరాబాదులో జరిగే సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణను ఎస్సై ఆవుల తిరుపతి చేతుల మీదుగా స్థానిక పోలీస్ స్టేషన్లో పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, మండలంలోని యువ రచయితలు, కవులు కళాకారులు అందరు ఈ సాహిత్యోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు కవి,గాయకులు గోనెల సమ్మన్న
ముఖ్య సలహాదారులు గాయకులు దరిపెల్లి మురళి, వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాడి రాజిరెడ్డి, మల్లేష్,రాయణవేణి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు
