మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.జిల్లాలో పరీక్ష నిర్వహణకు 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.14, 951 మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ మోతిలాల్,పోలీస్ మోడల్ అధికారిగా బెల్లంపల్లి ఏఆర్ ఏసిపి సుందర్ ను నియమించినట్లు తెలిపారు.