ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ
38వ వార్డు ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్.
నేటి ధాత్రి సిద్దిపేట:
స్థానిక సిద్దిపేట 38వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుగా ఎంపికైన గాదగోని జయ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా మంగళవారం ఇల్లు నిర్మాణం పనులు మొదలు పెడుతూ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మరియు నిర్మాణానికి తొలిమెట్టు అయిన ముగ్గు పోయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి లబ్ధిధారైన గాధగోని జయ సిద్దిపేట స్థానిక కాంగ్రెస్ నాయకులు బైరి ప్రవీణ్ కుమార్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ , 17 వార్డు ఇంచార్జీ, వెంకటేశ్వర గుడి డైరెక్టర్ బైరి నాగమణి మరియు మార్క సతీష్ లను ఆహ్వానించగా వారి ఆధ్వర్యంలో లబ్ధిదారుకు శుభాకాంక్షలు తెలిపి కొబ్బరికాయ కొట్టిన స్థానిక 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్ భూమి పూజ చేయడం జరిగిందనీ తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో 38వ వార్డ్ మున్సిపల్ అధికారి, 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.