సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలంలోని కిష్టంపేట గ్రామనికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో సిసి రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. 14 లక్షల విలువైన సిసి రోడ్ల నిర్మాణానికి బుధవారం కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆది శ్రీనివాస్ అహర్నిశలు శ్రమిస్తున్న తీరుపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ ఏ ఎంసి డైరెక్టర్ కరీమ్, మాజీ ఎంపిటిసి మొకానపెల్లి దేవరాజు మంజుల, బాణాల లక్ష్మా రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్, పోతుగంటి రఘుపతి,పోతుగంటి రంజిత్, చిగుర్ల మల్లేశం, చిగుర్ల నాగేష్,భూమాండ్ల కొమురయ్య, మ్యాదరి లచ్చయ్య, పుల్లూరి జెలందర్, భూమాండ్ల మధు,తదితరులు పాల్గొన్నారు.