Bhoomi Pooja for Ellamma Temple Entrance in Jahirabad
ఎల్లమ్మ తల్లి ఆలయం ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ తల్లి
ఆలయంలో కొత్త ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.గ్రామస్తులు ఆలయం అభివృద్ధి కోసం ముందుకు వచ్చి స్వచ్చందంగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ “ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామానికి శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. ఈ ముఖద్వారం నిర్మాణం ద్వారా ఆలయానికి మరింత గౌరవం పెరుగుతుంది” అన్నారు. యువత కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని భక్తి భావంతో పూజలు నిర్వహించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.
