Women Shakti Bhavan Foundation Laid in Siddapur
సిద్ధపూర్లో ఘనంగా మహిళా శక్తి భవన భూమి పూజ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పరిధిలోని సిద్ధపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ‘మహిళా శక్తి భవనం’ నిర్మాణానికి మరియు నూతన బోరు ను ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ విచ్చేసి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని పనులను ప్రారంభించారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు అభినందనీయమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే గ్రామస్తుల నీటి అవసరాలను తీర్చేందుకు నూతన బోరు ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హఫీజ్, సిద్ధపూర్ గ్రామ సర్పంచ్ షరీఫ్ ఉప సర్పంచ్ విమలమ్మ, వార్డు సభ్యులు రామిరెడ్డి,, కాంగ్రెస్ నాయకులు కొల్లూర్ సంగన్న వేణుగోపాల్, శ్రీకాంత్ రెడ్డి, సంగ్రామ్ పాటిల్, ఆలయ కమిటీ ధర్మకర్త మాలి పటేల్ మల్లప్ప, నవిన్ పటేల్ యూసుఫ్, పీల్డ్ అసిస్టెంట్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
