“Christian Cemetery Works Launched in Ramakrishnapur”
క్రిస్టియన్ స్మశాన వాటిక పనులకు భూమి పూజ…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణం లోని ఆర్కే 1 ఏ ప్రాంతంలో 15 లక్షల 15వ ఫైనాన్స్ నిధులతో చేపడుతున్న క్రిస్టియన్ శ్మశాన వాటిక నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మంచిర్యాల డీసీపీ భాస్కర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో అన్ని వర్గాల ప్రజల కోసం స్మశాన వాటికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి రఘునాథరెడ్డి రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జంగం కళ, మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, శ్యామ్ గౌడ్, క్రిస్టియన్ పాస్టర్ లు, నాయకులు పాల్గొన్నారు.
