బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్లకు భూమి పూజ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు రెడ్డబోయినీ గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ గారి సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (NREG S). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి కోటి 75లక్షల రూపాయలు నిధులతో కేటాయించడంతోసిసి రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సారం పెళ్లి గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి అధ్యక్షులు రాధా వినయ్ బిజెపి సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్ సందే వేని రాజు సిరిసిల్ల వంశీ బరికెల రాజు బిజెపి నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు