సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం:ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, (నేటి ధాత్రి)
బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం అని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
బాధితులకు సత్వర న్యాయం చేయడానికే ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 12 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించామని,
భూ తగాదాలు,ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించామన్నారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నరు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తున్నామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *