57 విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు 35 వైద్యులను చేసింది.
అనాధలకు ఉచిత విద్య అందిస్తూ గ్రీన్ వుడ్ పాఠశాల
విద్య విలువలను రక్షించడంలో ముందడుగు.
ఐఐటి ఎంఐటి లో సైతం గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థుల విజయ కీర్తనం మండలాన్ని గర్వించేలా చేస్తుంది.
గ్రీన్ వుడ్ టు యు ఎస్ ,సాఫ్ట్వేర్ రంగంలో లెక్కలేని విద్యార్థులు” 5 లక్షలకు పైచిలుకు రెమినేషన్” పొందుతున్న పాఠశాల విద్యార్థులు.
ఫేర్వెల్ డే కార్యక్రమంలో పాఠశాల ప్రారంభం పురోగతి వివరించిన యాజమాన్యం, తల్లిదండ్రులు ప్రముఖులకు కంటతడి పెట్టించింది.
మారుమూల ప్రాంతంలో గ్రీన్వుడ్ ప్రారంభం పెద్ద మొత్తంలో వైద్యులను చేయడం అనాధలకు ఉచిత విద్య అందించడం పై ముఖ్య అతిథుల ప్రశంసలు, విద్యార్థులకు సూచనలు.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
మారుమూల గ్రామం రవి ప్రాంతం మండలంలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న పరిస్థితులు ప్రైవేట్ పాఠశాల అనె ఆలోచన దూరం వరకు లేదు, ప్రైవేట్ పాఠశాల అంటే పట్టణాలు ధనవంతులకే పరిమితం అనే పరిస్థితులు, కానీ ఆ రోజుల్లో పేద అనాధ మరియు మధ్య తరగతి విద్యార్థులకు ఆంగ్ల విద్యపై ఎంతో ఆసక్తి పట్టుదల ఉన్నప్పటికీ అందుబాటులో పాఠశాల లేక మారుమూల ప్రాంతం వ్యవసాయ కుటుంబాలు నివసిస్తున్న మండలం కావడంతో దూర ప్రాంతాలకు వెళ్లి తమ పిల్లలకు ఆంగ్ల విద్యను అందించే స్తోమత లేని పరిస్థితి, అదే క్రమంలో ఫిదా మధ్య తరగతి తో పాటు అనాధ పిల్లలకు ఆంగ్ల విద్యను అందించాలని ఒక ఏకైక లక్ష్యంతో విద్యావంతుడు పట్టభద్రుడైన శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేస్తానని ఒక దృఢ సంకల్పంతో నాణ్యమైన విద్యను మండలంలోని విద్యార్థులకు విద్యను అందిస్తానని ఇతర పట్టణాల విద్యార్థుల్లా గాని తమ మండల విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఒక బలమైన సంకల్పం శ్రీనివాస్ రెడ్డి కి గ్రీన్ వుడ్ పాఠశాల 57 విద్యార్థులతో ప్రారంభించారు. ఈరోజు ఆ పాఠశాల లెక్కలేని విద్యార్థులతో వైద్య విద్యతో పాటు సాంకేతిక రంగంలో నిపుణులు తీర్చిదిద్దిన ఘనత శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ వుడ్ పాఠశాలకి దక్కడం జరిగింది. నాటి నుండి నేటి వరకు పాఠశాల స్థితిగతులకు సంబంధించి నాణ్యమైన విద్య తోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల పట్టుదల నేడు పాఠశాలకు ప్రజల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో నాణ్యమైన విద్యకు కేరాఫ్ గ్రీన్ గుడ్ గా మారింది.
విలువైన విద్య లక్ష్యంతో పేదలకు వరం గ్రీన్ వుడ్ పాఠశాల.
గ్రీన్ వుడ్ పాఠశాల అంటే పదవ తరగతి బోర్డ్ పరీక్షల్లో 9.5 8.5 10.10 జి పి ఏ లు సాధించే పాఠశాల అని మండలంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రీన్ వుడ్ పాఠశాల తన పేరును నిలబెట్టుకుంది, పాఠశాల నిర్వహణ కు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పాఠశాల యజమాన్యం ఉపాధ్యాయులతో విద్యను అమ్ముకునే విధంగా కాకుండా కేవలం నాణ్యమైన విద్య అందించడం కొరకు పాఠశాల యజమాన్యం మరియు ఉపాధ్యాయుల ప్రయత్నం ఆ పాఠశాలకు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చింది. గ్రీన్ వుడ్ పాఠశాలలో సుమారు ఒక వెయ్యి 50 మంది విద్యార్థులు ఇప్పటివరకు 9 ది10 వ తరగతి బ్యాచ్ లను జిల్లాలోని అత్యధిక జీపీఏ గ్రేడ్లు అందించిన ఏకైక పాఠశాలగా గుర్తింపు సాధించింది. గ్రీన్ వుడ్ పాఠశాల అంటే ధనవంతుల పిల్లలకి ఆంగ్ల విద్య అనే ఆ రోజుల్లో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల విద్యను అందిస్తున్న క్రమంలో నామమాత్రంగా విద్యార్థుల వద్ద ఫీజులు తీసుకొని ధాన్యమైన విద్యను అందించే పాఠశాలగా ప్రత్యేకంగా పేద విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్య అది కూడా ఆంగ్ల విద్య తమ పిల్లలు విద్యాభ్యాసం చేస్తారు అనే ఒక తల్లిదండ్రుల్లో ఒక బలమైన ముద్రను గ్రీన్ వుడ్ పాఠశాల సంపాదించుకుంది. వీళ్ళల్లో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆంగ్ల విద్య కొరకు తల్లిదండ్రులను పీడిస్తూ పాఠశాలలు నిర్వహిస్తున్న ఈ రోజుల్లో ఒక ట్రస్ట్ సేవలు ఒక సామాజిక సేవ విద్యను అమ్మడం కాదు విద్యను అందించడమే లక్ష్యంగా చాలీచాలని ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను అంతర్జాతీయంగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే నాణ్యమైన విద్యను అందించిన ఘనత గ్రీన్ వుడ్ పాఠశాలకి దక్కింది.
57 విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు 35 వైద్యులను చేసింది.
గ్రీన్ వుడ్ పాఠశాల ప్రస్తావనం 2006వ సంవత్సరంలో మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ఊరి చివర 57 విద్యార్థులతో పట్టభద్రుడు అయిన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జూన్ 16వ తేదీన ప్రారంభించడం జరిగింది. పాఠశాల నిర్వహణ అది కూడా ఆంగ్ల బోధన వ్యవహారంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని భావించిన శ్రీనివాస్ రెడ్డి వెనుకడుగు వేయకుండా పేద మధ్యతరగతి తో పాటు అనాధ పిల్లలకు విలువైన ఆంగ్ల విద్యను అందించి మహాదేపూర్ మండలానికి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతాను అన్న ఏకైక లక్ష్యమే శ్రీనివాస్ రెడ్డికి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగించింది. అలా 57 మంది విద్యార్థులతో ప్రారంభించిన గ్రీన్వుడ్ పాఠశాల 2016 లో మొదటి పదవ తరగతి బ్యాచ్ కు ఎంతో శ్రమ పట్టుదలతో విద్యార్థులపై పడిన కష్టాన్ని ఆనాడు 90% విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. 2016 నుండి పాఠశాల నాణ్యమైన విద్యను అందిస్తుందని మండల ప్రజలు మరియు తల్లిదండ్రులు గమనించడంతో పాఠశాల కేవలం విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని భావించిన తల్లిదండ్రులు మహదేవ్పూర్ మండలం తో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాలు అలాగే మహారాష్ట్ర నుండి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రీన్ వుడ్ పాఠశాలలో తమ పిల్లలకు విద్యాభ్యాసం చేయించుటకు పెద్ద సంఖ్యలో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది.
అనాధలకు ఉచిత విద్య అందిస్తూ గ్రీన్ వుడ్ పాఠశాల
విద్య విలువలను రక్షించడంలో ముందడుగు.
వీడు సమాజంలో విద్య అనేది ఒక వ్యాపారంగా మారి లక్షల రూపాయలను ఫీజుల రూపంలో దండుకుంటూ విద్యలు విద్యార్థులకు అందించాలని లక్ష్యం కాకుండా కేవలం విద్యను అమ్ముకోవడానికి తమ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా నేడు ప్రజల ముందుకు వచ్చి కేవలం విద్య పేరుతో ఒక దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తున్న రోజులు. ఇలాంటి సందర్భంలో 2006లో గ్రీన్ వుడ్ పాఠశాల ఏదైతే లక్ష్యంతో ప్రారంభించబడిందో ఆ లక్ష్యానికి చేరుకొని ఉన్నప్పటికీ కూడా పాఠశాల యజమాన్యం తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. మధ్యతరగతి కుటుంబాలకు వారి పిల్లలకు ఆంగ్ల విద్య అందించడంలో ఇబ్బందులు ఏమి ఉండవు కానీ బడుగు బలహీన పేద వర్గాల పిల్లల పరిస్థితులు వారి కళ్ళల్లో కూడా ప్రైవేట్ పాఠశాల ఆంగ్ల విద్య అనేది దూరం వరకు ఉండదు, అంతేకాదు తల్లిదండ్రులు లేని అనాధలు వారి బతుకుడే వారమైన పరిస్థితి రెండు పూటల భోజనం వారికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. అలాంటి పిల్లలకు ప్రైవేటు పాఠశాల అది కూడా ఆంగ్ల విద్య అనేది వారి ఆలోచనలు ఇప్పటికీ దరిచేరినటువంటి విషయం. కానీ గ్రీన్ వుడ్ పాఠశాల బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రత్యేకంగా అనాధ పిల్లలకు విద్యతో పాటు పార్టీ పుస్తకాలు యూనిఫామ్ లను ఉచితంగా అందించి తల్లిదండ్రుల ప్రేమను అందించే ప్రయత్నం చేయడం గర్వించాల్సిన విషయం. గ్రీన్ వుడ్ పాఠశాల పలు నిర్ణయాలు సరిత్రాత్మకంగా తీసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల పిల్లలకు అలాగే అనాధలకు ఇప్పటికీ వందకు పై చిలుకు విద్యార్థులకు ఉచితంగా విద్యలు అందించి వారి జీవితాలను తీర్చిదిద్దిన ఘనత గ్రీన్ వుడ్ పాఠశాలకు తగ్గడం గర్వకారణమని చెప్పొచ్చు.
ఐఐటి ఎంఐటి లో సైతం గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థుల విజయ కీర్తనం మండలాన్ని గర్వించేలా చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో బడుగు బలహీనవర్గాలతో పాటు అనాధ పిల్లలకు సైతం నాణ్యమైన విద్యను అందించడం కొరకు 18 సంవత్సరాలుగా అనేక విద్యార్థులను ఉన్నత శిఖరాలుగా తీర్చిదిద్దిన ఘనత గ్రీన్ వుడ్ పాఠశాల దక్కించుకొని నేడు సాంకేతిక రంగంలో సైతం విద్యార్థులకు అంతులేని విజయాలు సాధించేలా తీర్చిదిద్దడం జరిగింది. 2016 ప్రారంభమైన పదవ తరగతి మొదటి బ్యాచ్ నుండి మొదలుకొని నేటి వరకు ఇంటర్ డిగ్రీ బీటెక్ మెడికల్ రంగాలకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తోపాటు ఎం ఐ టి లో గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థులు తమ సత్తాను చాటి పాఠశాల పేరుతో పాటు మహాదేవపూర్ మండలానికి వేన్న తెచ్చే విధంగా విజయాలు సాధించడం జరిగింది. సుమారు ఇప్పటికీ 300కు పైచిలుకు విద్యార్థులు టెక్నాలజీ వైద్య మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో గత ఏడు సంవత్సరాల నుండి పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రతిభను చాటి చెప్పడం జరుగుతుంది. మారుమూల ప్రాంతాల ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పూణే ముంబై నాగపూర్ వరంగల్ ఐఐటి గుంటూరు విజయవాడ లాంటి ఎంఐటి విద్య కేంద్రాల్లో గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థులు చేరడం గర్వించాల్సిన విషయం.
గ్రీన్ వుడ్ టు యు ఎస్ ,సాఫ్ట్వేర్ రంగంలో లెక్కలేని విద్యార్థులు” 5 లక్షలకు పైచిలుకు రెమినేషన్” పొందుతున్న పాఠశాల విద్యార్థులు.
అటవీ తల్లి వడిలోని మహా మండలం లో అక్షర ద్వీపంలో వెలిసిన గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థుల తమ విద్య జీవితాన్ని ప్రారంభ దశతో ప్రారంభించి నేడు గ్రీన్ వుడ్ టు యు ఎస్ వరకు చేరిందంటే సరస్వతి తల్లి ఆశీర్వాదాలు గ్రీన్ వుడ్ పాఠశాలకు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. సరస్వతీ తల్లి ఆశీర్వాదాలు పేద విద్యార్థులకు ఉచిత మరియు నాణ్యమైన విద్యను అందించడమే గ్రీన్ వుడ్ పాఠశాల సరస్వతి తల్లి కరుణ పొందిందని కూడా చెప్పవచ్చు. మారుమూల ప్రాంతంలో ఏర్పడిన పాఠశాల 2016 నుండి పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు సుమారు 35 మంది వైద్య వృత్తి పూర్తి చేసుకొని నేడు యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా, తో పాటు లండన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, లాంటి కరుడుగట్టిన సాంకేతిక గడ్డగా మారిన అంతర్జాతీయ దేశాల్లో బీటె క్ ఎంటె ఎంబిబిఎస్ చార్ట్ అకౌంట్ బ్యాంకింగ్ రంగాల్లో గ్రీన్ వుడ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 5 లక్షలకు పైగా రిమునరేషన్ జీతం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా భారత దేశంలో సైతం జంట నగరాలు హైదరాబాద్ బెంగళూరు ముంబై పూణే వైజాగ్ లాంటి రాష్ట్రాల్లో బహుళ జాతి సంస్థల్లో కూడా గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ కి రోల్ విభాగాల్లో మరో 400 విద్యార్థులు ఉద్యోగులు చేయడం జరుగుతుంది. వింటేనే ఆశ్చర్యంగా ఉంది మారుమూల ప్రాంతంలో ఆంగ్ల భాష ప్రైవేట్ పాఠశాల గ్రీన్ వుడ్ ప్రస్తావనం మండలానికి సంబంధించిన విద్యార్థుల జీవితాలను వారి తల్లిదండ్రుల ఆశలను ఊహించని రీతిలో వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడం జరుగుతుందని తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేనట్టుగా గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల పేరుతో పాటు తమ గురువుల విద్యకు విలువ ఇచ్చే విధంగా ఎదగడం హర్షణీయం.
ఫేర్వెల్ డే కార్యక్రమంలో పాఠశాల ప్రారంభం పురోగతి వివరించిన యాజమాన్యం, తల్లిదండ్రులు ప్రముఖులకు కంటతడి పెట్టించింది.
గ్రీన్ వుడ్ పాఠశాల 2023 24వ పదవ తరగతి విద్యార్థుల వీడ్కో సమావేశాన్ని ఏర్పాటు చేసి పాఠశాల పురోగతి పాఠశాల ప్రారంభం నుండి నేటి వరకు ఎదురైన సమస్యలు ఇబ్బందులను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి వివరించడం జరిగింది. వీడ్కోల సమావేశానికి గ్రీన్ బోర్డ్ పాఠశాల ఆవరణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పాఠశాలలు తల్లిదండ్రులకు ప్రజలకు ఆకట్టుకునేలా ముస్తాబు చేయడం జరిగింది. సుమారు పెద్ద మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను తిలకించుటకు కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. రెండు వేల ఆరులో గ్రీన్ వుడ్ పాఠశాల 57 మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభించడం జరిగిందని ఎంన్నో ఇబ్బందుల మధ్య పాఠశాలను కొనసాగించడం జరిగిందని, ఫీజుల విషయంలో తల్లిదండ్రులు ఇచ్చిన సహాయ సహకారాలు నేడు పాఠశాల ఉన్నత శిఖరానికి ఎదగడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల సహాయ సహకారాలు అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాఠశాల ప్రారంభించిన సమయంలో వారి ఇబ్బందులను టీచర్ల జీతాల వ్యవహారం పాఠశాల నిర్వహణ ఇబ్బందులను వివరించడంతో విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు ముఖ్య అతిథులకు కంటతడి పెట్టక తప్పలేదు. పాఠశాల నిర్వహణ ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి ఇలా పాఠశాల తెరపైకి రావడం జరుగుతుంది నాణ్యమైన విద్య ఉపాధ్యాయుల నిర్వహణ లాంటి పలు రకాలకు సంబంధించి ఇబ్బందులను శ్రీనివాస్ రెడ్డి వివరించడం జరిగింది. ప్రస్తుతం వీడ్కోలకు సంబంధించిన విద్యార్థులకు కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యకు సంబంధించి తమ పాఠశాలలో విద్యార్థులు మొదిలిన క్రమశిక్షణను ఇంటర్ కళాశాలలో కూడా యధావిధిగా పాటించాలని అప్పుడే విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నది గుర్తుంచుకోవాలని పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రస్తుత వారి విద్య అర్హతలు వారి హోదాలను వీడ్కోలు జరుపుకుంటున్న పదవ తరగతి బ్యాచ్ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు కోరారు.
మారుమూల ప్రాంతంలో గ్రీన్వుడ్ ప్రారంభం పెద్ద మొత్తంలో వైద్యులను చేయడం అనాధలకు ఉచిత విద్య అందించడం పై ముఖ్య అతిథుల ప్రశంసలు, విద్యార్థులకు సూచనలు.
వీడ్కోల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖులు సైతం గ్రీన్వుడ్ పాఠశాల నిర్వహణ మారుమూల ప్రాంతంలో గత 18 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాఠశాలను ఏర్పాటు చేయడం నాణ్యమైన విద్యతో విద్యార్థులను తీర్చిదిద్దడం సులభమైన పని కాదని అన్నారు. పదవ తరగతి విద్యార్థుల వీడ్కోల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక జెడ్ పి టి సి గుడాల అరుణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రసాద్, పి ఎ సి ఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పాఠశాల డైరెక్టర్ సుధాకర్, పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గుడాల అరుణ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క విద్యను ఉపాధ్యాయులు గుర్తించి వారి భవిష్యత్తును నిర్ధారించే విధంగా వారికి సహకరించాలని ప్రత్యేకంగా తల్లిదండ్రులు వారి పిల్లల విద్యను పర్యవేక్షిస్తూ ముందుకు సాగించాలని, తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యపై ఒత్తిడి తీసుకోకుండా విద్యపై వారికి ఉన్న పట్టుదలతో ముందుకు సాగాలని కోరారు, విద్యార్థులకు విద్యపై పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకుంటారంటూ విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించిన తండ్రి ప్రేమను అలాగే విద్యపై ఉన్న నమ్మకాన్ని వివరిస్తూ ఒక కథను చెప్పడం జరిగింది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తను కూడా మారుమూల మండలంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసించి నేడు సబ్ ఇన్స్పెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగం పొందారని పదవ తరగతి వరకు విద్యార్థులు క్రమశిక్షణలో ఉండడం జరుగుతుందని ఆ క్రమశిక్షణను పై తరగతుల్లో కూడా కొనసాగిస్తేనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులవుతాయన్న విషయాన్ని విద్యార్థులు మరిచిపోవద్దని అన్నారు. కాలేజ్ తో పాటు ఇతర విద్యాభ్యాసం చేసే క్రమంలో చెడు పుసనాలకు బానిస కాకుండా తమ విద్యపై పాఠశాల విద్యార్థులు దృష్టి తప్పక సాధించాలని ఎస్సై ప్రసాద్ విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా చల్లా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో గ్రీన్ వుడ్ పాఠశాల ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమని పాఠశాల విద్యా విలువలను కాపాడుకుంటూ విద్యార్థులకు నాణ్యత మైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించడం హర్షనీయమని అన్నారు. ప్రత్యేకంగా పాఠశాలలో అనాధ విద్యార్థులకు ఉచిత విద్యను అందించి గ్రీన్ వుడ్ పాఠశాల యజమాన్యం ప్రజల హృదయాలను గెలుచుకుందని తిరుపతి రెడ్డి అన్నారు. వీడ్కోల కార్యక్రమంలో గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థులు విద్యతోపాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది అనేక చిన్నారులు సినిమా రంగం తో పాటు పల్లె ప్రకృతి రాజకీయ ఉపన్యాసాలు విద్యాభ్యాసం పై ప్రదర్శన వందేమాతరం లాంటి సంగీతాలకు నృత్యాలు ప్రదర్శించి ప్రజలను అలాగే తల్లిదండ్రులను ఆకట్టుకునేలా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలానికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో హాజరు కావడం జరిగింది.