భద్రాచలం నేటి ధాత్రి
చెట్లు భూమిపై ఉన్న అన్ని జీవులకు ఆక్సిజన్ అందిస్తాయి, జీవులు విడుదల చేసిన
కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి.
అదేవిధంగా అడవులు నీటిని, గాలిని శుద్ధిచేస్తాయి. ఔషదాల తయారీకి ఉపయోగపడతాయి.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మొక్కలను పెంచడం అందరికీ ఆరోగ్యదాయకం. 2013 మార్చి 21 తొలిసారిగా ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రీన్ భద్రాద్రి, భద్రాచలం వారు అభయాంజనేయ స్వామి పార్కు నందు మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనీ మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని రక్షిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు బెల్లంకొండ రాంబాబు, కోశాధికారి విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులు డా. గొళ్ళ భూపతి రావు, కామిశెట్టి కృష్ణార్జునరావు, డా. కృష్ణ ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంకొండ రాంబాబు
అధ్యక్షులు
గ్రీన్ భద్రాద్రి, భద్రాచలం