సీతారాముల కళ్యాణం
చూద్దాం రారండి
తండోపతండాలుగా తరలివచ్చిన జనం
రామనామ స్మరణతో నిండిపోయిన దేవాలయాలు..
చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా, సీతారాముల కళ్యాణం జరిగింది.
ఈ కళ్యాణానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తి పరవశంతో దేవాలయాలు భక్తులతో నిండాయి. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ జనాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనిల్ శర్మ పూజారి మాట్లాడుతూ రాముని జీవితం దేశానికి ఆదర్శమని, రాముడు ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, నేటి సమాజానికి ఆదర్శమని అన్నారు. కళ్యాణం అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది వరకు పాల్గొన్నారు.