వాసవి క్లబ్ ద్వారా సేవలు విస్తృతపరచాలి ఎస్సై రాజమౌళి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల వాసవి క్లబ్ తన సేవను విశిష్టపరిచి మారుమూల ప్రాంత ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని గుండాల ఎస్సై రాజమౌళి శుక్రవారం గుండాల మండల కేంద్రంలోని మానాల వెంకటేశ్వర్లు నివాస ప్రాంగణంలో వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ గుండాల మరియు ప్రెస్ క్లబ్ గుండాల ఆర్యవైశ్య సంఘం గుండాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యునాని వైద్య శిబిరానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రసంగిస్తూ మారుమూల ప్రాంతాల్లో వాసవి క్లబ్ సేవలు విస్తృతపరిచి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. గుండాల వాసవి క్లబ్ ప్రజలకు అనేక సేవలందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ సమాజ సేవలో వాసవి క్లబ్ ముందుడటం హర్షించదగ్గ విషయం అన్నారు. వాసవి క్లబ్ గ్రీన్ఫీల్డ్ అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని మారుమూల ప్రాంతంలోని ప్రజలు గత మూడు నాలుగు నెలల నుండి కాళ్ల నొప్పులు ఒంటినొప్పులతో ఇబ్బందులు పడుతున్న సంఘటన చూసి చలించి ఎనిమిది వందల మందికి యునాని మందులు అందించామని ఇప్పటికే వాసవి క్లబ్ ద్వారా 20 కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేసామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఈ యునాని వైద్య శిబిరం దాతలు మానాల వెంకటేశ్వర్లు మానాల నారాయణమూర్తి,మానాల శ్రవణ్, మానాల సతీష్, మానాల ప్రణీత్ సుమారు 50 వేల విలువచేసే యునాని మందులు అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఐతా శ్రీశైలం, నాగ మల్లయ్య, పూజిత్, పాలడుగు భరత్, తవిడిశెట్టి రాంబాబు, తాటికొండ వీరన్న, కిరణ్,మానాల ఉపేందర్, తవిడిశెట్టి నాగరాజు, తాటిపల్లి సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుపతి,పాపా చారి, రంజిత్,నారాయణ, పెండకట్ల సత్యం,యాకయ్య,రామకృష్ణ,దడిగల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పొంబోయిన ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.