ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి ఘన సన్మానం
నడికూడ,నేటిధాత్రి:
వరంగల్,ఖమ్మం,నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నకైన పీ ఆర్ టీ యు టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డిని నడికూడ మండల శాఖ తరఫున హనుమకొండ లోని జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా హనుమకొండ జిల్లా పిఆర్టియు భవనానికి రావడం జరిగింది.పీఆర్ టీ యు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్, ప్రధానకార్యదర్శి కటుకోజ్వల సతీష్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను,అపరిషృతంగా ఉంటున్న ఉపాధ్యాయుల సమస్యలపై మండలిలో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని వారు కోరారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పింగిళి శ్రీపాల్ రెడ్డి వారి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నన్నే సాబ్,బేబీ రాణి పాల్గొన్నారు.