మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణ మున్సిపల్ కమిషనర్ గా గత నాలుగు సంవత్సరాలుగా నిస్వార్ధంగా, నిజాయితీగా, ఎంతో గొప్ప సేవలు అందించిన గద్దె రాజు పట్టణ మున్సిపాలిటీ నుండి రామగుండం మున్సిపాలిటీకి బదిలీ కావడంతో శనివారం పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలుపుతూ, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, రాయబారపు కిరణ్, ఎండి జమాల్, సాగర్, లక్ష్మణ్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.