వేములవాడ రూరల్ నేటి ధాత్రి
వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలకు
కరీంనగర్ పార్లిమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ లాడ్స్ నిధుల నుండి 3 లక్షల రూపాయలను
వట్టెంల గ్రామంలో మహిళ సంఘం భవనం నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది మరియు చెక్కపల్లి గ్రామ కబడ్డీ క్రీడ కారులకు సింథటిక్ కొట్ మ్యాట్ కొరకు 3 లక్షల రూపాయలు మరియు చెక్కపల్లి గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ హాల్ కొరకు 3 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది కాగా ఇట్టి ప్రొసీడింగ్స్ కాపీలను బీజేపీ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మహిళ సంఘాల సభ్యులకు ,క్రీడాకారులకు ,రెడ్డి సంఘం ప్రతినిధులకు అందించడం జరిగింది కాగా వారందరూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కి మరియు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ కృతజ్ఞతలు తెలుపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బీజేపీ నాయకులు గ్రామస్థులు యువకులు పాల్గొన్నారు