జిల్లా యువజన సంఘాలు హర్షం
వేములవాడ రూరల్ నేటి దాత్రి
మన బడి మన ఊరు పథకం కింద గతములో ప్రభుత్వం నిధులు కేటాయించి పాఠశాలలకు మహర్థషా వచ్చింది అలాగే ఇటీవల ప్రతి జిల్లా లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల క్రీడాల్లో రానించాలని స్పోర్ట్స్ అభివృద్ధి కొరకు 10000కేటాయించి నిధులు విడుదల చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు సోమినేని బాలు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేయడం జరిగింది రాష్ట్రములో దశబ్దాలుగా పాఠశాల్లో క్రీడాలను నిర్వహించడం అభినందనీయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వారి ప్రతిభ ను వెలికి తీయటానికి ఈ పథకం దోహదం చేస్తుందని సోమినేని బాలు అన్నారు స్పోర్ట్స్ కోసం నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు క్రీడా శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ లకి ధన్యవాదాలు తెలుపుచున్నాము