గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం కాచనపల్లి జగ్గు తండా నుండి లక్ష్మీదేవి పల్లికి రెండు కోట్ల 50 లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన గ్రామాలలో ఉన్న ప్రజలకు అవసర నిమిత్తం వెళ్లడానికి రోడ్డు సదుపాయం లేక ఇబ్బంది పడుతుండడంతో ఎన్నికల సమయంలో మీ గ్రామానికి రోడ్డు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట ప్రకారం మంజూరు చేయించడంతో ఇన్ని రోజులు ప్రయాణించే గ్రామ ప్రజలకు మోక్షం లభించిందని లక్ష్మీదేవి పల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు తమ ధన్యవాదాలు తెలిపారు.
గిరిజన పల్లెలకు బీటీ రోడ్డు మంజూరు
