కల్వకుర్తిలో ఘనంగా వసంత పంచమి వేడుకలు.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణంలో సుభాష్‌నగర్‌లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 77 మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేయించుకోగా, సుమారు 250 మంది తల్లిదండ్రులు, పోషకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రబంధకారిణి సభ్యురాలు శ్రీమతి నిర్మల అక్షరాభ్యాసం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు సేవకుల రాజు, విద్వత్ సమితి సభ్యులు సూరం తిరుపతి రెడ్డి దామోదర్ రెడ్డి ,ప్రబంధ కారిణి సభ్యులు కూన కిశోర్ ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
