
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో శ్రీప్రగతి పాఠశాలలో వసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకర్షించాయి. అనంతరం పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరానికి తల్లిదండ్రులు చిన్నారులను అడ్మిషన్లు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అన్నదానం రాధాకృష్ణ, ప్రిన్సిపల్ వెంకటనారాయణ, డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, మునీందర్ రెడ్డి, బేతి భూమయ్య, శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.