
YSR's death anniversary celebrated
కొయ్యాడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
అనంతరం సాయుదపోరాట యోధులకు నివాళులు అర్పించిన నాయకులు
పరకాల నేటిధాత్రి
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రక్కల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి లు రాజశేఖర్ రెడ్డికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ గుండెల్లో నిలిచిన నాయకుడు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషిచేసి ఈరోజు దేశంలోనే ఎవరూ చేయలేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన మహా గొప్ప నేత ఆరోగ్యశ్రీ కార్డుతో దేశంలోనే గొప్ప పేరుగాంచిన మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఎంపీ లోని గెలిపించుకొని దేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానాయకుడని నాటి నుంచి నేటి వరకు రాజశేఖర్ రెడ్డి గుర్తులు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు.ఆ మహానీయుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.సెప్టెంబర్ 2 తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు,పరకాల అమరవీరులకు వర్గాల అమరధామంలో వారిని స్మరిస్తూ నివాళులర్పించడం జరిగింది.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పరకాల ప్రాంతంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పట్టుకుని పరకాల ప్రాంతంలో తిరుగుతున్న వారిని నిజాం ప్రజకారులు కాల్పులు జరిపి ఎంతో మందిని చిత్రహింసల గురిచేసి మహిళలు వృద్ధులు చిన్నపిల్లలను చూడకుంట విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నటువంటి రజాకారులను ఎదిరించి పోరాడిన మహనీయులను స్మరిస్తూ తెలంగాణ కోసం పరకాల ప్రాంతానికి చెందిన అమరులు ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకొని వారికి స్మరించడం జరిగింది కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో
సమన్వయ కమిటీ సభ్యులు చిన్నల గునాథ్,ఒంటేరు రామ్మూర్తి,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,పసుల రమేష్,దుబాస్ వెంకటస్వామి,పాడి ప్రతాప్ రెడ్డి,సదానందం గౌడ్,బొచ్చు బాబు,నల్లల అనిల్,ఒంటేరు శ్రావణ్ కుమార్,పాలకుర్తి శ్రీనివాస్,బొచ్చు మోహన్
తదితరులు పాల్గొన్నారు.