ఘనంగా స్వయం పాలన దినోత్సవం

కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:-

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనాపూర్ గ్రామ ప్రైమరీ స్కూల్లో శుక్రవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధలక్ష్మి, శోభారాణి , సత్యనారాయణ, ప్రవళిక, శారద మేడం ఆధ్వర్యంలో స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఈఓగా సంజయ్, ఎంఈఓ గా చెర్రీ, ప్రధానోపాధ్యాయులుగా సనయ, ఉపాధ్యాయులుగా కె ప్రశాంత్ , అఖిల్, సంధ్య , సబెర, సాయి, పిఈటీలుగా హర్షవర్ధన్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధానోపాధ్యాయురాలు సిద్ధలక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ముందుండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయురాలు సిద్దలక్ష్మీ, శోభారాణి, సత్యనారాయణ , ప్రవళిక, శారద పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!