ఘనంగా పదవి విరమణ మహోత్సవం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయు లు వనం వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ సన్మాన సమావేశం కన్నుల పండువగా జరిగింది. ఈ పదవి విరమణ కార్యక్రమానికి పిఆర్ టి యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు మల్యాల తిరుపతి రెడ్డి ,పలిత శ్రీహరి , టిఆర్టిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాసిరి. రాజిబాపు ఎంఈఓ రావు శాయంపేట గడ్డం బిక్షపతి , జి హెచ్ ఎం జిల్లా ప్రధాన కార్య దర్శి రామకృష్ణ వివిధ జిల్లా, మండల అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు మండ లంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, వరంగల్ వాయిస్ చీఫ్ ఎడిటర్ గడ్డం కేశవ మూర్తి పాల్గొని ప్రసంగిం చారు. వెంకటేశ్వరరావు బంధుమి త్రులు, మాజీ ప్రస్తుత ఉపాధ్యా యులు, విద్యార్థులు అనంత రం సన్మానగ్రహీత వనం వెంకటేశ్వరరావు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమా న్ని బాలుర ఉన్నత పాఠశాల శాయంపేట సీనియర్ ఉపాధ్యా యులు కాయిత శ్రీనివాస్ సిబ్బంది, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.