
వేములవాడ నేటి ధాత్రి
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. కళ్యాణ్ కుమార్ జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకట కృష్ణ మరియు విశిష్ట అతిథులు గా రాజన్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాఠశాల డైరెక్టర్స్ అయిన ఇప్పపుల వినోద్ మరియు కుమ్మరి శంకర్ హాజరు అయినారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని దీనికి ముఖ్యకారణం మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు అని మనం కూడా దేశ భక్తి కలిగి ఉండాలి అని దేశం కోసం పాటు పడాలి అని తెలిపారు కరస్పాండెంట్ విద్యార్థులకు,తల్లి తండ్రులకు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు స్వర్ణోత్సవ గణతంత్ర దినోత్సవ శుభాకాక్షలు తెలిపారు. పాఠశాల విద్యార్థులు పలురకాల వేషధారణలో వీక్షకులను అనందింపచేశరు. పలు సాంస్కృతిక కార్య్రమాలతో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది అని పలువురు హర్షం వ్యక్తం చేశారు.