ఘనంగా పంభాఆరాట్ మహోత్సవం

అదిమూల యాకయ్య 19 వ పడి గురుస్వామి ఆధ్వర్యంలో పంబా ఆరాట్టు ,జలక్రీడలు

పంభాఆరట్ మహా అన్నదాన దాతగా గ్రామ అయ్యప్ప స్వాములు,రాంపూర్ గ్రామ ప్రజలు.

అయ్యప్ప శరణుఘోషతో మారుమ్రోగిన రాంపురం గ్రామ పరిసర ప్రాంతం.

మంగళ హారతులతొ అయ్యప్పస్వామికి మహిళలు పూజలు స్వాగతాలు.

రాంపురం గ్రామం లో వేడుక గా ఊరేగింపు కార్యక్రమం

రాంపురం ఏరు లో జలక్రీడలు.

మరిపెడ నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామపంచాయతీలో ఆంజనేయస్వామి దేవాలయంలోని మణికంఠుడు కి హోమం,కలుశ పూజ నిర్వహించారు, అనంతరం స్వామి వారిని ట్రాక్టర్ పై ఊరేగింపుగా విధుల లో తిరుగుతూ ప్రజల కు దర్శనం ఇచ్చారు, గ్రామ శివారులోని ఏరులో అయ్యప్ప స్వామి కీ చేసిన పంభాఆరట్,జలక్రీడ వేడుకలు అంబరాన్నంటాయి. కేరళ రాష్ట్రంలోని శబరిమలైలో నిర్వహించే విధంగా అయ్యప్పస్వామికి జలక్రీడలు ఆడించారు.అనంతరం అష్టాభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. అష్టాభిషేకాలైనా నీరు,తేనె,నెయ్యి, పంచదార, పంచామృతం,జీడిపప్పు ,బాదం, పిస్తా, పాలు, పెరుగు ,విభూది,కుంకుమ,పసుపు చందనం లతోపాటు 24 రకాల అభిషేకాలను వేద పండితులు,పూజారులు బ్రహ్మశ్రీ పనిభట్ల రాకేష్ గురుస్వామి మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.సోమవారం గ్రామ ఏరు లొ నిర్వహించిన పంభాఆరాట్ మహోత్సవాన్ని రాంపురం గ్రామంలో ని అయ్యప్ప స్వాములు, గ్రామం లో ని కొంత మంది దాతలు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో 19 వ పడి గురు స్వామి ఆదిముల యాకయ్య, మాడుగుల వెంకన్న గురుస్వామి, ఈరగాని రమేష్ గురుస్వామి, ఈరగని నరేష్ గురుస్వామి,ఈరగని సురేష్ తానేశా గురుస్వామి,ఈరగని ఉపేందర్ గురుస్వామి, పొడుపు కంటి సురేష్ గురు స్వామి డైరీ ఆంజనేయులు గురు స్వామి ఈరగాని నవీన్ పెరుస్వామి,గోపీనాథ్ గదస్వామి,రాంపల్లి సూర్యకుమార్ గంటస్వామి, అలువాల యాకయ్య కత్తి స్వామి,వెల్ది ఉమేష్ కన్నె స్వామి,పొడుపుగంటి మహేష్ కన్నెస్వామి,ఈరగని అజయ్ కన్నెస్వామి, శ్రీకాంత్ కన్నెస్వామి,దాత్రిక కన్నెస్వామి,గ్రామ పెద్దలు రామ సహాయం జయపాల్ రెడ్డి,వంగ పెద్ద వెంకన్న,రాంపల్లి బుచ్చి రాములు, రాంపల్లి నాగన్న,వంగ చిన్న వెంకన్న,అనుమూల నాగిరెడ్డి, ఈరగాని రమేష్, చిర్ర మహిబాబు,దోమల విష్ణు, సుధ గాని శంకర్, వెల్ది చిన్నమల్లయ్య, ఇరగని అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!