తంగళ్ళపల్లి నేటి ధాత్రి….. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం గాను 800 సంవత్సరాల చరిత్ర కలదని అలాగే గౌడ సంఘం సభ్యులు అమ్మవారిని ఊరేగింపుగా పుట్టకు ధనిపోయుట నిర్వహించారు అనంతరం గ్రామంలో ఇంటింటి నుండి అమ్మవారికి బోనాలు నిర్వహించి లందేనుండి ఎల్లమ్మ ఎదుర్కొని గడ ఊరేగింపుగా డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని కొనసాగించారు అనంతరం బుధవారం రోజున గావు పట్టుట సిద్ధులు తిరుగుట అమ్మవారి కళ్యాణం ఉంటుంది కాబట్టి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు