రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ ప్రధాన కూడలి బస్టాండ్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ స్థాయిలో అతిపెద్ద 56ఫీట్ల ఎత్తు గల భారీ జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం మార్చి9న నేచర్ యూత్ క్లబ్ అసోసియేషన్ గోపాలరావుపేట ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు కాసారపు పర్శరాం గౌడ్ తెలిపారు. ఈకార్యక్రమానికి గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు, అధికారులు, పాఠశాలల యజమాన్యాలు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, మేధావులు, కుల, యువజన సంఘాల నాయకులు, భారీ స్థాయిలో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నేచర్ యూత్ క్లబ్ అసోసియన్ సభ్యులు కోరారు.