శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా అభిషేకాలు
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని శంకర్ గంజిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్‌కు విధివిధానాలతో అభిషేకం, పుష్పమాలంకరణ, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ పూజల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎల్.ఎన్. రమేష్ పాల్గొన్నారు. అలాగే ఆలయ కమిటీ నిర్వాహకులు దాచ లక్ష్మీనారాయణ, రాచ శివ, న్యాయవాది ధార వెంకటేష్, ఈపూరి వెంకటేష్, లగిశెట్టి శ్రీకాంత్, నూకల విజయ్, నూకల నాగరాజ్, చిట్యాల నరసింహ, వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్, అంగడి నరేందర్, నూకల రామకృష్ణ, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
