ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మాతృభాష వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల లో తెలుగు ఉపాధ్యాయులు గడ్డం శంకర్ గారి ఆధ్వర్యంలో మాతృ భాష దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో పాల్గొన్న ఎంఈఓ కోడెపాక రఘుపతి గారు మాట్లాడుతూ మధురమైన మాతృభాషయైన మన తెలుగును కాపాడుకుంటే మనల్ని మనము కాపాడుకున్నట్టేనని, సంస్కృతి సంప్రదాయాలు కూడా రక్షింపబడతాయని,మన మాతృభాషే ఇతర భాషల అధ్యాయానికి పునాదవుతుందని , అటువంటి మాతృభాషను కాపాడుకోవాలని,అన్యభాషలు నేర్చుకుంటూ,అమ్మభాషను ఆదరించడమే ఈ దినోత్సవ నిర్వహణ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని తెలిపారు. ఈ వేడుకల సందర్బంగా పాటలు,నృత్యాలు,కవితలు,పద్యాలు,కవి పరిచయాలు,చిత్రలేఖనాలతో ఆకట్టుకున్న విద్యార్థులందరికీ ఎంఈఓ కోడెపాక రఘుపతి గారు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజమౌళి,సరళ,నీలిమా,కల్పన, ఉస్మాన్ అలీ, బుజ్జమ్మలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *