జైపూర్ ఎస్టిపిపి వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఎస్టిపిపి వద్ద బుధవారం రోజున హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్టిపిపి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు విక్రమ్ కార్మికుల త్యాగానికి చిహ్నమైన ఎర్రజెండాను ఆవిష్కరించారు.ముఖ్య అతిథులుగా హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిమ్మాపురం సారయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వెట్టి చాకిరి, బానిసత్వం,శ్రమదోపిడిలకు వ్యతిరేకంగా మరియు 18 గంటలు పనిచేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ 1886 మే 1వ తేదీన లక్షలాదిమంది కార్మిక సోదరులు చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాడి రక్త దర్పణం చేయడం వల్ల వారి రక్తంలో నుండే ఎర్రజెండా ఆవిర్భవించిందని, చికాగో అమరవీరుల నెత్తుటి త్యాగాల వల్ల ప్రపంచ దేశాలన్నీ ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయుటకు చట్టం జరిగిందని తెలిపారు.కానీ నేటి పాలకులు ప్రైవేటికరణ, కాంట్రాక్టు విధానాన్ని వేగవంతం చేసి ఆనాటి లాగే వెట్టిచాకిరి, శ్రమదోపిడి,బానిసత్వం లోనికి కార్మికులందరినీ నెట్టివేసి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు సేవకులుగా పనిచేస్తూ 1886 విధానాన్ని అమలు చేయుటకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.సింగరేణి యాజమాన్యం మరియు పవర్మేక్ లాంటి ప్రైవేటు సంస్థలు కలిసి కార్మికులతో వెట్టి చాకిరి చేపిస్తూ వారి శ్రమను దోపిడి చేసి బానిసత్వం లోకి వెళ్లే విధానాలని అమలు చేస్తున్నాయని,ఎస్టిపిపి కోసం జైపూర్ మండలంలోని గంగిపల్లి, ఎల్కంటి అనేక గ్రామాల రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను త్యాగం చేస్తే నిర్వాసితులకు పవర్ ప్లాంట్ లో శాశ్వత ఉద్యోగాలు, మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండగా నేటికీ వాటిని పాలకులు అమలు చేయలేదని, ఎస్టిపిపీ లో పెద్ద స్థాయి అధికారులు ఎంతటి కుంభకోణాలకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు కానీ కార్మికులు మాత్రం తమకు జరిగిన అన్యాయాలను హక్కులపై ప్రశ్నిస్తే మాత్రం వారిని పనిలో నుండి తీసివేయడం మహిళలు అని కూడా చూడకుండా మహిళలపై పోస్టర్ వేసి వారిని అవమానించడం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం జరుగుతుందని వీటన్నిటిపై హెచ్ ఎం ఎస్ ఆధ్వర్యంలో తీవ్ర పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి కాంట్రాక్ట్ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ రెడ్డి, ఆర్గనైజర్ సాయి కృష్ణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎలుక రమేష్, ట్రెజర్ సత్యనారాయణ చారి, సెక్రటరీ రామగిరి మల్లేష్, మామిడాల రమేష్, రెక్కుల రాజేందర్ రెడ్డి, కోటయ్య మరియు హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా నాయకులు అనిల్ రెడ్డి, దుర్గం లక్ష్మణ్, రేగుంట సందీప్, తుల అనిల్, మహిళ నాయకులు సోడారి మల్లిక మరియు కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!