ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను హెచ్ఎంఆర్డి చెవిటి మూగ పాఠశాల, భూపాలపల్లి నందు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గోనె భాస్కర్ అధ్యక్షతన పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1952లో బాపూజీ రూపొందించిన సహకార సంఘాలు దేశంలోనే కావడం విశేషము అని చేనేత ఉత్పత్తుల క్రయవిక్రయాల కోసము హైకోర్టును ఏర్పాటు చేశాడు ఇతర వృత్తుల వారిని కూడా సహకార రంగ పరిధిలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించినట్టు వారు తెలియజేశారు. 2010లో స్వగ్రామంలో లక్ష్మణ్ సేవా సదన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు వారు తెలియజేశారు. తొలి, మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి వీరు నడిపించారని తొలినాళ్లలో సమైక్యవాది ఐనా బాపూజీ మొదట విశాలాంధ్రకు మద్దతు ప్రకటించిన ఆంధ్ర పాలకుల వివక్షను స్వయంగా ఎదుర్కొని తన అభిప్రాయాలను మార్చుకొని 1969 నాటి తెలంగాణ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమాన్ని కూడా అండగా నిలిచారు తెలంగాణ పీపుల్స్ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షలు చాటుతూ వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం జలదృశ్యంలోనే పురుడు పోసుకుందని తెలంగాణ అనే నినాదం ఎత్తుకున్న వారందరికీ అండగా నిలిచారని 96 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా ఢిల్లీలోని ఎంతలో తెలంగాణ కోసం దీక్ష చేశారని వారు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ కోసం విశేషమైన కృషి చేసిన వ్యక్తిగా కొనియాడారు అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చెవిటి మూగ విద్యార్థులకు పలకలు మరియు పండ్లు పంపిణీ చేసినట్లు వాళ్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాగవతం బిక్షపతి, తౌటం ప్రభాకర్, కుసుమ కృష్ణమోహన్, కుసుమ సుధాకర్, దాసరి సుదర్శన్, అడ్డగట్ల శ్రీధర్, షేర్ కుమారస్వామి, జల్ది రమేష్, శేఖర్ నాని, తౌటం అశోక్, తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!