
జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీలోని రసూల్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నానని,చెన్నూర్ నియోజకవర్గంతో తరతరాలుగా మా కుటుంబానికి, నాకు ఎనలేని అనుబంధం ఉందని, ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తానని, గ్రామాల అభివృద్ధికి నా సాయిశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ముదిగుంట మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి పండరి, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.