ఘనంగా సంక్రాంతి సంబరాలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి……
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సంక్రాంతి ముందస్తు సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తూ. శుభోదయం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరగగా దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్. తమిళనాడు. తెలంగాణలో. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవడం. జరుగుతుందని .ముందుగా భోగి పండుగ రోజున ప్రతి మనిషి. తలంటు స్నానం చేయాలని చిన్నపిల్లలకు భోగి పండ్లతో.స్నానం చేయించాలని కుటుంబానికి పట్టిన నరదృష్టి తీసివేయడానికి భోగి మంటలు మండించాలని ఇంటిముందు మధ్యలో రంగులు వేసి మధ్యలోభోగి పండ్లను గొబ్బెమ్మలను పెట్టాలని దానివలన గోవు ప్రత్యేకత తెలుపుతుందని భోగి మంటలు కాలిన తర్వాత బూడిదను చిన్న పిల్లలకు బొట్టు పెట్టినట్లయితే ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరైన తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి మాట్లాడుతూ ముందస్తుగా ఇట్టి సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా మమ్మల్ని సిబ్బందిని పిలవడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పండగలను పిల్లల మధ్య జరపకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెబుతూ రెండవ రోజు మకర సంక్రాంతి పండుగ జరుపుకోవడం దాంట్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మూలంగా పండగ జరుపుకోవడం జరుగుతుందని శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడం మూలంగా మంచి ఫలితం వస్తుందని చరిత్ర చెబుతుందని పితృదేవతలకు సంబంధించిన శ్లోకం చదివినట్లయితే పితృ దేవతలకు సంబంధించిన పండుగలు ఒకటి దీపావళి రెండవది దసరా మూడవది అమావాస్య పే త్రమాస్య ఈరోజుల్లో పితృదేవతలను పూజించినట్లయితే కుటుంబానికి అనుగ్రహం వలన మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు పెద్దలకు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెబుతూ ఇలాంటి సంక్రాంతి సంబరాలు పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన రంగోలి కార్యక్రమంలో బహుమతులు మా చేతుల మీదుగా అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు మూడవరోజు అయినటువంటి కనుమ రోజున గోవులను సంరక్షించడం జరుగుతుంది ఆరోజు గోవులకు స్నానం చేయించి పసుపు కుంకుమ లాంటివి శరీరానికి రాసి వాటికి కొత్త దుస్తులు కప్పడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న పేర్లు పెట్టి వాటిని పిలవడం జరుగుతుంది దేశాన్ని సైనికులు ఏ విధంగా రక్షిస్తారో మనము కూడా రైతుల రక్షించుకునే బాధ్యత అందరి పైన ఉంది ఎందుకనగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతు మనందరికీ అన్నం పెట్టలేకపోవడం జరుగుతుందని అప్పుడు పెద్ద ప్రళయం వస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు పండించిన పంటలు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఆలోచించి మనము వెన్నుదన్నుగా ఉండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా పాఠశాల ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అది కూడా పిల్లల మధ్యల దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక తంగళ్ళపల్లి మండల ఎస్సై ఉపేంద్ర చారి సిబ్బందితో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి సంబరాల కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవి లతా రెడ్డి. ప్రీ ప్రైమరీ ఇన్చార్జి పద్మశ్రీ. పి ఈ టి అజయ్ కుమార్. కంప్యూటర్ శ్రీనివాస్. సిరిసిల్ల బ్రాంచ్ పాఠశాల ఇన్చార్జి లావణ్య. అకాడమిక్ ఇన్చార్జి సాయి ప్రియ . విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
