Ambedkar Youth Association Holds Grand Vardhanti
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు.
చిట్యాల.నేటిదాత్రి :
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగెందర్ ఆధ్వర్యంలో జరిగిన భారత రత్న ప్రపంచ మేదవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య విచ్చేసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు దొడ్డి కిష్టయ్య లు మాట్లాడుతూ… డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మ జ్యోతిరావు పూలే ఉద్యమ స్ఫూర్థితో అంటరాని పోవాలని , కులాలు నిర్మూలన కావాలని మనుష్యులు అందరు సమానమనే భావనతో విద్య ఏ ఒక్కరి సొత్తు కాదని చాటిచేప్పిన మహనీయుడు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించి, ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందిన గొప్ప న్యాయ కోవిదుడన్నారు మనకు అందించిన రాజ్యాంగంలో ప్రజలకు మహిళలకు అనేక హక్కులను , రిజర్వేషన్లు కల్పించిన దేవుడన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అంబేద్కర్ గారిని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆ మహనీయుని అడుగు జాడల్లో నడవాలని,ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల నిండిన వారికి ఓటు హక్కు కల్పించారని తెలిపారు. మనం స్వేచ్ఛగా జీవిస్తూ సమానత్వంతో కలిసి ఉండాలని ఆ మహనీయుని ఆలోచనలు సిద్ధాంతాలు భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ గ్రామ గ్రామాన ఆయన ఆశయాలు కొనసాగించుటకు కృషి చేయాలని కోరారు. ఈ దేశం కోసం మనకోసం తన కుటుంబాన్ని తన పిల్లలను త్యాగం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని తెలిపారు. ఆ మహనీయుని ప్రజలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ పుల్ల ప్రభాకర్ మండల సీనియర్ నాయకులు ధబ్బేట రమేష్ విగ్రహం దాత కట్కూరి నరసయ్య కాట్కూరి మొగిలి మండల మాజీ అధ్యక్షులు సరిగోమ్ముల రాజేందర్ మండల ప్రచార కార్యదర్శి, కట్కూరి రాజు గురుకుంట్ల కిరణ్ గడ్డం కొమురయ్య గడ్డం సదానందం పాముకుంట్ల చందర్ గుర్రపు తిరుపతి శీలపాక ప్రణీత్ గుర్రపు రాజమౌళి ఏకు కిషన్ గుర్రపు శంకర్ సాదా స్వామి శనిగరపు మొగిలి సరిగోమ్ముల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
